నెమలి సురేష్ ఆశయాలకు ఘన నివాళి

Facebook
X
LinkedIn

56వ జయంతి సందర్భంగా అభిమానుల స్మరణ

హైదరాబాద్ :

జీహెచ్‌ఎంసీ మాజీ కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, దివంగత ప్రజానేత నెమలి సురేష్ 56వ జయంతి వేడుకలు మల్లాపూర్ ప్రాంతంలోని స్వామి వివేకానంద నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు, అభిమానులు, నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు నెమలి సురేష్ ప్రజా సేవలను స్మరించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని, సామాన్య ప్రజలతో మమేకమై సేవలందించిన ఆయన జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

మాజీ కార్పొరేటర్ నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల కోసం చేసిన సేవే శాశ్వతమని, నెమలి సురేష్ ప్రజా సంక్షేమాన్ని తన జీవిత ధ్యేయంగా మార్చుకున్న నాయకుడని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నెమలి రవికుమార్, పి. వీరస్వామి, సీతాల వీరస్వామి, పి.జి. సుధర్శన్, దంతూరి రాజు గౌడ్, సద్గుణరావు, అనిల్ జైన్, పీఆర్ మోహన్, కోయలకొండ రాజేష్, నెమలి శ్రావణ్, సత్యనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, చారి, కాటం గౌడ్, నెమలి సందీప్, వెంకటేశ్వర్లు, షేక్ అన్వర్, విజయ్ రెడ్డి, యాదగిరి, జహంగీర్, సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సూర్యచంద్ర యూత్ క్లబ్ సభ్యులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలు డివిజన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై నెమలి సురేష్‌కు ఘన నివాళులు అర్పించారు.