జోబి ఎల్. రెడ్డి కి బీబీసీతో ఎలాంటి సంబంధం లేదు

Facebook
X
LinkedIn

భారత్ బైబిల్ కాలేజీ, నజరీన్ గ్రామర్ హై స్కూల్ లో పోలీసుల జోక్యం సరికాదు

మీడియా సమావేశంలో వెల్లడించిన పాఠశాల యాజమాన్యం

మేడ్చల్ :

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని భారత్ బైబిల్ కాలేజ్,నజరీన్ గ్రామర్ హై స్కూల్ రోజుకో మలుపు తిరుగుతుంది. పాఠశాల పునఃప్రారంభం రోజుననే వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాఠశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సెబాస్టియన్ మాట్లాడుతూ జోబి ఎల్. రెడ్డి రాజకీయ నాయకులు, పోలీసుల అండదండలతో క్యాంపస్ లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సంస్థ నుండి గతంలోనే తొలగించబడిన మాజీ సభ్యుడు జోబి ఎల్. రెడ్డి కాలేజీ ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బోర్డు సభ్యులు, యాజమాన్యం మీడియా సమావేశంలో వెల్లడించారు.జోబి ఎల్. రెడ్డిపై ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలతో మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయని యాజమాన్యం పేర్కొంది.ఈ వ్యవహారం వెనుక ఓ పార్టీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని కాలేజీ ప్రతినిధులు ఆరోపించారు. భారత్ బైబిల్ కాలేజ్ గత 56 సంవత్సరాలుగా విద్యా సేవలు అందిస్తోందని యాజమాన్యం తెలిపింది. ఇప్పటివరకు 3,670 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించారని, పేద పిల్లల కోసం నాజారెన్ గ్రామర్ స్కూల్‌ను కూడా నిర్వహిస్తున్నామని పేర్కొంది.జోబి ఎల్. రెడ్డిపై గత సంవత్సరం జూలైలో ఎఫ్ఐఆర్ నమోదు అయిన ఇంతవరకు అతనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాలేజీ సిబ్బందిని భయాందోళనలకు గురిచేస్తున్న వ్యక్తులపై ప్రభుత్వం, పోలీసు శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని బీబీసీ యాజమాన్యం డిమాండ్ చేసింది.