సిడ్నీలో బోండి బీచ్ లో యూదుల పండుగ సందర్భంగా హింసాకాండ

Facebook
X
LinkedIn

          15 మందిని దారుణగా హతమార్చిన దుండగులు

సిడ్నీ :

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండి బీచ్ లో యూదుల పండుగ సందర్భంగా హింసాకాండలో పాల్పడి, 15 మందిని దారుణగా హతమార్చిన దుండగులు ఓ తండ్రీ కొడుకులని సోమవారం పోలీసులు తెలిపారు. కఠినమైన తుపాకి నియంత్రణ చట్టాలు ఉన్న ఆస్ట్రేలియాలో దాదాపు మూడు దశాబ్దాలలో ఇటువంటి ఘోరమైన కాల్పుల ఘటన జరగడం ఇదే ప్రథమం.కాల్పులు జరిపిన 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ అనే దుండగుడిని పోలీసులు కాల్చిచంపగా, అతడి కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. సాజిద్ పండ్ల వ్యాపారి .ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ పాకిస్తానీ సంతతికి చెందిన వారని అమెరికా నిఘా అధికారులు పేర్కొన్నట్లు సిబిఎస్ న్యూస్ పేర్కొంది. సాజిద్ అక్రమ్ కు న్యూ సౌత్ వేల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ధరించే ఆకుపచ్చ జెర్సీని ధరించినట్లు కన్పించింది.కొడుకు నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో జన్మించిన పౌరుడు.