జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Facebook
X
LinkedIn

ఇండ్ల స్థలాల పై కొత్త విధానం తేవాలి
టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా 3వ మహాసభ ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్ :

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఆడహాక్ కమిటీ కన్వీనర్ పిల్లి రామచందర్, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య విజ్ఞప్తి చేశారు.
ఆదివారం మల్కాజ్గిరి నేరేడుమెట్ లోని ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా మూడవ మహాసభ ఘంనంగా జరిగింది. టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ గుమ్మడి హరిప్రసాద్ అధ్యక్షత జరిగిన ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీడబ్ల్యూజేఎఫ్ ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదనీ, జర్నలిస్టులు అందరిదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తేవాలని కోరారు.
జర్నలిస్టుల పట్ల వారి సమస్యల పట్ల చిత్తశుద్దితో కూడిన నిబద్దతతో పనిచేసే ఏకైక సంఘం టిడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. సంఘంగా గుర్తింపు పొంది జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాటం చేస్తూ, జర్నలిస్టుల పక్షాన పోరాడే సంఘంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు.


జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. కేంద్రం వెంటనే 29 చట్టాల స్తానే కోడ్లను తేవడాన్నీ ఖండించారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాసిన బాధ్యత ఉందని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి సలీమ మాట్లాడారు.


గత కార్యక్రమాల నివేదికను గుమ్మడి హరిప్రసాద్ ప్రవేశపెట్టారు. జిల్లా కో కన్వీనర్ పి మల్లేష్ జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడిటేషన్ కార్డులు హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బానోతు రవి, పి మోహన్ రెడ్డి, కొండ స్వామి , జి రోజా రాణి తదితరులు చర్చలలో పాల్గొన్నారు.


టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యవర్గం
టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షుడుగా పి మల్లేశ్, ఉపాధ్యక్షులుగా జి రోజా రాణి, ఎం రామ్ బాబు, నరేంద్ర, కార్యదర్శిగా బానోతు రవి, సహాయ కార్యదర్శులుగా ఐ సత్యనారాయణ, సింగం రాజు, జె సుధాకర్, కోశాధికారిగా మధు, జిల్లా కార్యవర్గ సభ్యులుగా దుర్గాప్రసాద్, గుంటి సహదేవ్, పాండు, హుస్సేన్, రజనీకాంత్, మహేందర్, పి నరసింహమ్మ, ది అరుణ్ కుమార్, ఏ విష్ణు, సిహెచ్ నరసింహ, బాలకృష్ణ, శ్రీనివాస్, ఎం శ్రీనివాస్ రెడ్డి, పి కిరణ్, బి చైతన్య రెడ్డి ఎన్నికయ్యారు. నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా వినోద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గుమ్మడి హరిప్రసాద్, బాలు, ఎస్ రాజేంద్ర ఎన్నికయ్యారు.