పాలమూరు-రంగారెడ్డి ,సమ్మక్క-సారక్క ప్రాజెక్టు లకు నీటి కేటాయింపులు చేపట్టాలి

Facebook
X
LinkedIn

సి.డబ్ల్యూ.సి చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి

తెలుగునాడు, హైదరాబాద్ :

పాలమూరు-రంగారెడ్డితో పాటు సమ్మక్క-సారక్క ప్రాజెక్టు లకు నీటి కేటాయింపులు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

బుధవారం ఉదయం ఢిల్లీలో ఆయన సి.డబ్ల్యూ.సి చైర్మన్ అతుల్ జైన్ తో సమావేశం అయ్యారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకు పోవడాన్ని నిలువరించాడంతో పాటు పోలవరం బ్యాక్ వాటర్ ల పై ఆయన సి.డబ్ల్యూ.సి చైర్మన్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మొత్తం 90 టి.యం.సి ల నీరు కేటాయించాలని అందులో మొదటి దశలో 45 టి.యం.సి ల నీటిని కేటాయించాలని ఆయన కోరారు.అందుకు సంబంధించిన సమగ్ర సనాచారాన్ని సి.డబ్ల్యూ.సి చైర్మన్ కు అందించినట్లు ఆయన వివరించారు.

అంతే గాకుండా

ములుగు జిల్లా తుపాకుల గూడెం వద్ద నోర్మితమౌతున్న సమ్మక్క-సారక్క బ్యారేజ్ కి అవసరమైన 44 టి.యం.సి ల నీటి కేటాయింపుల అంశంపై ఆయన చర్చించి అందుకు సంబంధించిన వివరాలను చైర్మన్ కు అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తున్న కృష్ణా జలాశయాల వినియోగం వివరాలు తెలుసు కోవడానికి తక్షణమే టెలిమెట్రి పరికరాలన అమర్చలని ఆయన కోరారు.ఈ పరికరాల ఏర్పాటుకు అవసరమైన నిధులను తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే కే. ఆర్.యం.బి కి చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

పోలవరం బ్యాక్ వాటర్ తో తెలంగాణా ప్రాంతం ముంపుకు గురయ్యే అంశాన్ని ఆయన అతుల్ జైన్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు

అతుల్ జైన్ సి.డబ్ల్యూ.సి చైర్మన్ గా మాత్రమే కాకుండా కే. ఆర్.యం.బి చైర్మన్ తో పాటు పోలవరం అథారిటీ చైర్మన్ గా ఉన్నందున అంతరాష్ట్ర జలవనరుల పంపకం పాటు వంటి అంశాలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్.డి.ఎస్.ఏ ఇచ్చిన నివేదికపై ఆయన చర్చిస్తూ మెడిగడ్డ బ్యారేజి మాత్రమే కాకుండ అన్నారం సుందిళ్ళ బ్యారేజిల నిర్మాణంలో ఉన్న లోపాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు అవసరమైన సాంకేతిక నిపుణులను కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా సి.డబ్ల్యూ.సి చైర్మన్ ను కోరారు.