అర్హుల ఓట్లు తొలగించకుండా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలి: డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్
కీసర, :
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ సూచించారు.
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన బూత్ లెవెల్ అధికారుల (బీఎల్‌వోలు), బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్, కీసర మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామిడి విజయ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామారావు సుజాత, కీసర కాంగ్రెస్ అధ్యక్షుడు జూపల్లి రవీందర్, మాజీ ఎంపీటీసీ రమేష్ గుప్తా, బూత్ ఇన్‌చార్జులు ముద్ద వెంకటేష్ యాదవ్, బీఎల్‌వోలు చర్లపల్లి కృష్ణారెడ్డి, నల్ల మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ చారి, ప్రవీణ్ ముదిరాజ్, చిక్కుడు రమేష్ ముదిరాజ్, పోష బోయినరాజు యాదవ్, ముద్దం లక్ష్మణ్ శర్మ, మాజీ ఉపసర్పంచ్ అభిలాష్ శర్మ, మూడు చింతలపల్లి అధ్యక్షుడు వెంకటేష్, మల్లేష్, సీనియర్ నాయకులు పెనింటి కృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు కర్రే బాలమణి, జనరల్ సెక్రటరీ సత్తిరెడ్డి, అల్లాదుర్గం కృష్ణ, డీజే సాయి, శ్రీశైలం యాదవ్, బీఎల్‌వో సరిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల వేణుకుమార్, జిల్లా కార్యదర్శి నర్సింగ్‌రావు, తరుణ్, నరసింహతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.