కేంద్ర విధానాలతో పౌర స్వేచ్ఛ కు విఘాతం

Facebook
X
LinkedIn

రాజమండ్రి :

సిపిఐ (ఎమ్ ఎల్) రామచంద్రన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీ ముఖ్యుల సమావేశం జైరాం అధ్యక్షతన కాటవరం లో జరిగిన సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ దేశంలో అమలవుతున్న ప్రభుత్వ విధానాలవల్ల పౌర స్వేచ్ఛ దెబ్బ తింటుదని,ప్రశ్నించే వారిని దేశ ద్రోహులు,అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేయడం ప్రజాస్వామ్యనికి మంచిది కాదని ,ప్రతి నిరసన జంతర్ మంతర్ లా మారినప్పుడే ప్రజాస్వామ్యం,పౌర హక్కులు నిలబడుతాయని అన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్లుట్ల ఉపేందర్ మాట్లాడుతూ బీజేపీ 12 ఏళ్ల పాలనలో ప్రజల ప్రభుత్వ రంగ సంస్థల ను అమ్మెవేయడం జరిగిందని, సహజ వనరులు,అడివి,సముద్ర ఓడరేవులు అదానీ, అంబానీ చేతిలో పెట్టిన మోదీ. ప్రజల హక్కును తుంగలో తొక్కారని ,రాజంగం కల్పించిన ప్రాథమిక సౌకర్యాలు కుడు,గూడు,విద్య,వైద్యం, ఉపాధి అవకాశాలు లేకుండా ,ప్రజలను కాందిశీకులగా మార్చి వేశారని మండి పడ్డారు, ఈ దళారీ, దోపిడి పాలక వర్గాల కు వ్యతిరేకంగా విప్లవ ఐక్య ఉద్యమ లకు సన్నద్ధం కావాలని పిలుపు ఇచ్చిన
సిపిఐ (ఎమ్ ఎల్) రామచంద్రన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు కార్యదర్శి గా బి జయరాం,ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, పార్టీ కార్యవర్గ సభ్యులుగా బత్తుల అప్పలరాజు, పల్లే సురేష్, సత్యవతి, భీమ్ రెడ్, చంద్ర శేఖర్,ఎం రమణ,సత్తిబాబు లను రాష్ట్ర కమిటీ సభ్యులు గా ఎన్నుకోవడం జరిగింది.