బీసీ మహిళను అవమానిస్తే సహించేది లేదు
బీసీలను అవమానిస్తే జేఎన్టీయూ ను ముట్టడిస్తాం
సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు జరుగుతున్న అన్యాయం పై దృష్టి సారించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
హైద్రాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలను అవమానించడం రాష్ట్ర ప్రభుత్వం అవమానించడం అలవాటుగా చేసుకుందని, బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వo వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు . బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు,
రాష్ట్రంలో ప్రధాన యూనివర్సిటీలలో అగ్రకులాలకు వైస్ ఛాన్స్ లర్ లుగా, రిజిస్టార్ లుగా అవకాశం కల్పిస్తుందని, ఒకే ఒక్క బీసీ మహిళకు మొదటిసారి జేఎన్టీయూ యూనివర్సిటీ నుండి రిజిస్టర్ గా అవకాశం కల్పించి, 45 రోజుల్లోనే ఆమెను జేఎన్టీయూ రిజిస్టర్ బాధ్యత నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు.
జేఎన్టీయూ చరిత్రలో ఇప్పటి వరకు 27 మంది రిజిస్ట్రార్లు పనిచేశారు. కానీ తొలిసారిగా ఒక మహిళకు, అది కూడా బీసీ వర్గానికి చెందిన మహిళకు ఆ అవకాశం దక్కింది. అలాంటి వ్యక్తిని కేవలం 45 రోజులకే తొలగించే కుట్ర చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు
“ఇది ఒక మహిళకు జరిగిన అవమానం కాదు… బీసీ సమాజ ఆత్మగౌరవానికి, మహిళ లోకానికి జరిగిన అవమానం గా భావిస్తున్నామన్నారు.
24 గంటలలోపు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. జయలక్ష్మి గారికి న్యాయం చేయాలి. లేనిపక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి, యువజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, అప్పుడు కూడా దిగిరాకపోతే వేలాది మందితో జేఎన్టీయూ ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా,బీసీ జేఏసీ కో చైర్మన్ ఉప్పరి శేఖర్ సగర, బిసి యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు సంధ్యారాణి, సత్యరాజ్ గౌడ్,ఆనంతోజు బ్రమ్మ చారి, వెంకటేష్ గౌడ్, కొప్పుల చందు,వలబోజు నర్సిమ్మ చారి, తడుపునూరి సత్యం, గుంటి మహేష్,మారోజు సోమా చారి, మీసాల గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు..









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.