చిన్నచర్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
చర్లపల్లి, :
చిన్నచర్లపల్లిలోని హిందూ స్మశాన వాటికలో ఇతర మతాలకు స్థల కేటాయింపులు చేస్తున్నారనే సమాచారం నేపథ్యంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆదివారం అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక ప్రజలు, కుల సంఘాల నాయకులతో కలిసి స్మశాన వాటికను సందర్శించి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా హిందువుల అంత్యక్రియల కోసం వినియోగిస్తున్న ఈ స్థలాన్ని అదే ఉద్దేశంతో కొనసాగించాలని కోరారు. హిందూ స్మశాన వాటికకు సంబంధించిన సంప్రదాయాలను, స్థానికుల మనోభావాలను గౌరవించాలని అన్నారు. ఇతర మతాలకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వేరే ప్రాంతాల్లో గుర్తించి కేటాయించాలని సూచించారు.
ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి హిందూ స్మశాన వాటిక యథాతథంగా కొనసాగేందుకు చర్యలు కోరనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్మశాన వాటిక సందర్శనలో దొమ్మాట నాదం, రుద్రగోని రాంచందర్ గౌడ్, కొమ్ము నర్సింగ్, పల్లె వెంకటరెడ్డి, రాంబాబు, కె. బాలరాజ్, లక్ష్మణ్ గౌడ్, టి. బీరప్ప, రాజేష్, డి. బాబి, అబ్బయ్య, ఆనంద్ గౌడ్‌తో పాటు వివిధ కాలనీల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.