కుషాయిగూడలో మహిళ అదృశ్యం

Facebook
X
LinkedIn

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

కుషాయిగూడ, :

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చక్రిపురం హైటెన్షన్ లైన్ ప్రాంతానికి చెందిన కే. లక్ష్మి (55) తన కుమార్తె అలేఖ్య (28) కనిపించడం లేదంటూ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో అలేఖ్య తన గదిలో నిద్రించేందుకు వెళ్లినట్లు తెలిపారు.

అయితే జూలై 7వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నిద్రలేచిన లక్ష్మి, కుమార్తె గదికి వెళ్లగా ఆమె కనిపించలేదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదని ఫిర్యాదులో తెలిపారు.

అదృశ్యమైన అలేఖ్య ఎత్తు సుమారు 5.5 అడుగులు ఉండగా, తెలుగు, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలదని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి మహిళ ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టినట్లు కుషాయిగూడ పోలీసులు వెల్లడించారు. అలేఖ్యకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా కుషాయిగూడ పోలీసులను సంప్రదించాలని కోరారు.