చర్లపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Facebook
X
LinkedIn

రూ. కోటి దాటిన వ్యయంతో పార్కులు, డ్రైనేజీలకు శంకుస్థాపన

చర్లపల్లి, :

ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

వాసవి శివనగర్ కాలనీలో రూ.20 లక్షలతో పార్కు అభివృద్ధి పనులకు, చక్రిపురంలో రూ.27 లక్షలతో డ్రైనేజీ లైన్ నిర్మాణానికి, లక్ష్మీనగర్‌లో రూ.31 లక్షలతో డ్రైనేజీ పనులకు, విద్యా మారుతి కాలనీలో రూ.22 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, తాగునీటి సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు మెరుగుపడేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.