పవిత్ర అమర్‌నాథ్ మంచు లింగం దర్శించిన హైదరాబాద్ భక్తులు

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌ :

పవిత్ర అమర్‌నాథ్ యాత్రలో భాగంగా సోమవారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొల్లారానికి చెందిన సుదర్శన్, చర్లపల్లికి చెందిన రుద్రగోని వెంకటేష్ గౌడ్‌తో పాటు రాజేష్, టి. కిరణ్ గౌడ్, గణేష్, డి. కిరణ్, ప్రవీణ్, విజయ్, రామ్ ప్రసాద్ తదితరులు అమర్‌నాథ్ గుహలోని మంచు లింగాన్ని దర్శించుకున్నారు.

పవిత్ర మంచు లింగం దర్శనం కలగడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ యాత్ర విజయవంతంగా పూర్తవడం ఆనందంగా ఉందన్నారు. దర్శనం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు.

యాత్ర విజయవంతంగా పూర్తికావడంతో గురుస్వాములు సుదర్శన్, రుద్రగోని వెంకటేష్ గౌడ్‌లను యాత్ర సభ్యులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు “హర హర మహాదేవ్”, “బమ్ బమ్ భోలే” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.