జాతీయ వాటర్‌పోలో పోటీలకు తెలంగాణ జట్టు సిద్ధం

Facebook
X
LinkedIn

79వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న క్రీడాకారులు

జట్టు సభ్యులకు యూనిఫామ్‌లు, టీమ్ కిట్ అందజేత

హైదరాబాద్, :

79వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సీనియర్ వాటర్‌పోలో జట్టు సిద్ధమైంది. జూలై 7 నుంచి 12 వరకు చెన్నైలోని కట్టన్‌కుళత్తూర్ డాక్టర్ టి. పారివేందర్ ఆక్వాటిక్ కాంప్లెక్స్‌లో జరిగే జాతీయ పోటీల్లో తెలంగాణ జట్టు పోటీపడనుంది.

ఈ సందర్భంగా గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో శుక్రవారం జట్టు సభ్యులు, కోచ్‌లు, మేనేజర్‌కు యూనిఫామ్‌లు, టీ-షర్టులు, టీమ్ కిట్‌ను అందజేశారు. ఈ కిట్‌ను 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ సంస్థ స్పాన్సర్ చేసింది.

కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. ఉమేష్, 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ఎండీ ఎల్.ఎం. శంకర్, జట్టు మేనేజర్ టి. కిరణ్‌కుమార్, ఐ. బాలమల్లేశ్వర్, వాటర్‌పోలో కోచ్ తిరుపతి, ఆయుష్ యాదవ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

కాగా, జాతీయ పోటీలకు తెలంగాణ వాటర్‌పోలో జట్టు ఎంపిక ట్రయల్స్ ఇటీవల అంబర్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.