విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

Facebook
X
LinkedIn

లయన్స్ జిల్లా 324 హెచ్ చార్టర్ డే వేడుకల్లో సేవా కార్యక్రమం

హైదరాబాద్ :

లయన్స్ జిల్లా 324 హెచ్ చార్టర్ డే వేడుకల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కుషాయిగూడ ఆధ్వర్యంలో బుధవారం సౌత్ కమలనగర్ ప్రభుత్వ ఎం.పీ.యూ.పీ. పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్‌ను పంపిణీ చేసి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. కార్యక్రమంలో కుషాయిగూడ లయన్స్ ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ లయన్ కొత్త రామారావు, జిల్లా కార్యదర్శి (గ్లోబల్ కాజెస్) లయన్ కొత్తపల్లి రాంబాబు, క్లబ్ అధ్యక్షుడు లయన్ తారకేశ్వరరావు, క్లబ్ కార్యదర్శి లయన్ చి. వెంకట రామరాజు, కోశాధికారి లయన్ మోహన్ పాల్గొన్నారు.

అలాగే సీనియర్ సభ్యులు లయన్ చంద్రశేఖర్, లయన్ రవిశంకర్ రాజు, లయన్ పెద్ది శ్రీనివాస్, లయన్ అంజనీ కుమార్, లయన్ శ్రావణ్, లయన్ శ్రీనివాస్ తదితరులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సేవా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన వైఆర్‌పీ ఫౌండేషన్ చైర్మన్ రవి ప్రసాద్కు, అలాగే కార్యక్రమం విజయవంతానికి సహకరించిన తక్షణ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ గంప నాగేశ్వరరావుకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సమాజ సేవే ధ్యేయంగా లయన్స్ సంస్థ విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.