విద్యార్థుల భవిష్యత్తుకు జోయాలుక్కాస్ చేయూత

Facebook
X
LinkedIn

దేశవ్యాప్తంగా 13 వేల మందికి విద్యా సహాయం.. ఏఎస్‌రావు నగర్‌లో 100 మందికి కిట్ల పంపిణీ

హైదరాబాద్, :

ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన ‘జాయ్ ఆఫ్ స్కూలింగ్’ కార్యక్రమం ద్వారా వేలాది మంది విద్యార్థులకు విద్యా చేయూత అందుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్‌రావు నగర్ ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, వారికి అవసరమైన పాఠ్య సామగ్రిని అందించడం, విద్యాభ్యాసానికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా జోయాలుక్కాస్ సంస్థ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది భారతదేశంలోని సుమారు 13 వేల మంది విద్యార్థులకు విద్యా సహాయం అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధిలో సామాజిక బాధ్యతతో కూడిన సంస్థల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మద్దతు అందించేందుకు జోయాలుక్కాస్ ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. విద్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల ద్వారా విద్యా రంగానికి చేయూతనందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, గంప కృష్ణ, జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్ మేనేజర్ మిఖిన్, అసిస్టెంట్ మేనేజర్లు సతీష్, అరుణ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యా కిట్లు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.