ప్రజా సుపరిపాలనకు అందుబాటులో పోలీసులు

Facebook
X
LinkedIn

డిజిపి సి.వి. ఆనంద్

పోలీసు యంత్రాంగంగానికి, పౌరులకు మధ్య దూరాన్ని తగ్గించడమే నూతన క్యాంపు కార్యాలయం ప్రధాన ఉద్దేశం

మల్కాజ్గిరి :

పౌరులకు పోలీస్ యంత్రాంగం సుపరిపాలన అందించటమే ముఖ్య ఉద్దేశం గా డీజీపీ సి.వి. ఆనంద్ మల్కాజిగిరి కమిషనర్ క్యాంప్ కార్యాలయాన్ని ప్రజా సేవల మెరుగుదలకు ప్రారంభించారు.
పోలీసు సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం మరియు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్, ఐపీఎస్ , తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి తో కలిసి నూతన మల్కాజిగిరి కమిషనర్ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు సమీపంలోని మల్కాజిగిరి జోనల్ కార్యాలయ ప్రాంగణంలో ఉంది.

పోలీసు యంత్రాంగానికి, పౌరులకు మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ నూతన క్యాంప్ కార్యాలయ ప్రధాన లక్ష్యం. కమిషనరేట్ సేవలను వికేంద్రీకరించడం ద్వారా, ప్రజలు తమ సమస్యల కోసం ప్రధాన కార్యాలయానికి దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలు పొందేలా ఈ సౌకర్యం రూపొందించబడింది. నేరేడ్‌మెట్‌లో ఉంది.

ఈ సౌకర్యం మల్కాజిగిరి జోన్ మరియు ఉప్పల్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు పరిపాలనా సౌలభ్యాన్ని మరియు సమన్వయాన్ని పెంచుతుంది. ఈ రెండు జోన్లలోని మొత్తం 11 పోలీస్ స్టేషన్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఈ క్యాంప్ కార్యాలయం కేంద్రీకృత హబ్‌గా పనిచేస్తుంది.

“ఇది క్షేత్రస్థాయి అధికారులకు, ఉన్నతాధికారులకు మధ్య కీలకమైన అనుసంధానంగా పనిచేస్తుంది. ప్రజల ఫిర్యాదులను మరింత వేగంగా, సున్నితంగా పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుంది” అని ప్రారంభోత్సవంలో డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్, కలెక్టర్ & డీఎం శ్రీ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఐఏఎస్, హైడ్రా కమిషనర్ శ్రీ ఎ.వి. రంగనాథ్ ఐపీఎస్, అడ్మిన్ డీసీపీ, మల్కాజిగిరి జోన్, ట్రాఫిక్ మల్కాజిగిరి డీసీపీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.