అనాథ చిన్నారులకు రూ.20 వేల ఆర్థిక సాయం

Facebook
X
LinkedIn

అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి

ఏఎస్ రావునగర్ :

ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు కమలానగర్ స్ఫూర్తి లయన్స్ క్లబ్ ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు.

డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని సాయిలోక్ కాలనీలో చిన్నారుల నివాసానికి వెళ్లిన వారు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోవడం పూడ్చలేని లోటేనని, అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగాలని చిన్నారులకు ఓదార్పు పలికారు.

ఈ సందర్భంగా చిన్నారుల తక్షణ అవసరాల కోసం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో విద్య, వైద్యం తదితర అవసరాల విషయంలో కూడా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. సమాజంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను ఆదుకోవడానికి దాతలు, సేవా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంఎం రాజు, భాస్కర్ రెడ్డి, కరిపే ప్రవీణ్, వంజరి మధు, కాలనీ వాసులు ప్రకాష్, శ్రీనివాస్, సురేష్, రాణి, అంజయ్య, నాగరాజు, నరసమ్మ, రాజేష్, ఉమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.