క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సి హక్కులు కోల్పోతారు

Facebook
X
LinkedIn

              సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూ డిల్లీ :

మతమార్పిడి అనంతరం ఎస్సిల హక్కుల గురించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సి హక్కులు కోల్పోతారని సుప్రీం తెలిపింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్ కులంలోకి రారని పేర్కొంది. వేరే ఏ మతంలోకి మారినా షెడ్యూల్ కుల హోదాను కోల్పోతారని వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కాస్ట్ హక్కులను కోల్పోతారని ఎపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. మత మార్పిడి తరువాత ఎస్‌సి హక్కులు కొనసాగవని జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ ఎన్‌వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. Also Read – నగరంలో పలు చోట్ల భారీ వర్షం Advertisement మరిన్ని కనుగొనండి రాజకీయ విశ్లేషణ పుస్తకాలు స్థానిక ఈవెంట్ ప్రమోషన్లు రాష్ట్ర వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చర్చి నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆనంద్ చర్చి నిర్వహిస్తున్నాడని అక్కల రామిరెడ్డి, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద ఆనంద్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సవాల్ చేస్తూ రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆనంద్ వ్యక్తి అనే వ్యక్తి పాస్టర్‌గా మారాడని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు వర్తించవని హైకోర్టులో పిటిషన్‌లో వివరించాడు. షెడ్యూల్ కులాల రాజ్యాంగం 1950లోని మూడోవ నిబంధన ప్రకారం హిందువు కాని వ్యక్తి ఎలా కులానికి చెందుతాడని కోర్టు ప్రశ్నించింది. పుట్టుకతో హిందువు అయినప్పటికి అతడు వేరే మతంలోకి మారడని, ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందిన వాడు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందు మతంలో కుల ప్రస్తావన ఉంది కానీ మహమ్మదీయ, క్రైస్తవ మతంలో కుల ప్రస్తావన లేదని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారత దేశ ఉన్నత న్యాయం స్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు కొట్టివేయాలని ఆదేశాలు జారీ చేసింది.