వైసిపి హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నాం

Facebook
X
LinkedIn

క్యూఆర్ కోడ్ తో పాస్ పుస్తకాలు  : సిఎం చంద్రబాబు నాయడు

అమరావతి :

కూటమి ప్రభుత్వం వచ్చాక.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయడు తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అడ్డగోలుగా వ్యవహరించారని, వైసిపి హయాంలో భూములను చెరబట్టారని అన్నారు. నంద్యాల జిల్లాలో సిఎం పర్యటించారు. కొత్తబురుజులో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాస్ పుస్తకాలపై, సర్వే రాళ్లపై మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి? అని..ఇదేంటని అడిగితే.. బాధితులపైనే కేసులు పెట్టారని విమర్శించారు. వైసిపి హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని, రికార్డులు తారుమారు చేయకుండా..పక్కాగా పాస్ పుస్తకాలు, క్యూఆర్ కోడ్ తో పాస్ పుస్తకాలను ఇస్తున్నామని తెలియజేశారు. తప్పులను సరిచేసి.. మీ భూములను మీకు అప్పగిస్తామని, గత ఐదేళ్ల లో అన్నీ వివాదాలే, కుంభకోణాలేనని మండిపడ్డారు. తాను శ్రీవారి భక్తుడని..అలిపిరి ఘటనలో ఆ దేవుడే తనను కాపాడాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని, తిరుమల ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని, మద్యాన్ని కల్తీ చేసి.. వేలమంది ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. మీ జీవితాలు, ఆరోగ్యంతో ఆడుకున్నారని, ఎన్ డిడిబి రిపోర్టులో ఉన్నదే ఆనాడు చెప్పానని చంద్రబాబు పేర్కొన్నారు.