అమరుల జ్యోతులు అందుకున్న కార్మిక యోధులు

Facebook
X
LinkedIn

విశాఖపట్నం :

వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన అరవీరుల జ్యోతులు సిఐటియు మహాసభ ప్రాంగణంలో స్ఫూర్తిని నింపాయి. అనకాపల్లి జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జ్యోతి, శ్రీకాకుళం మందస నుంచి వీర గున్నమ్మ జ్యోతి, నెల్లూరు జిల్లా నుంచి కే పెంచలయ్య జ్యోతులను అక్కడి కార్మికవర్గం తీసుకువచ్చిన సంగతి తెలిసింది. ప్రారంభ స్థానాల నుండి మహాసభ ప్రాంగణం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోరాట కాంతులు వెదజల్లిన ఆ జ్యోతులు బుధవారం ఉదయానికి మహాసభ ప్రాంగణానికి చేరుకున్నాయి. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామంటూ మహాసభ ప్రతినిధులు చేస్తున్న నినాదాల మధ్య కార్మిక యోధులు అందుకున్నారు. అల్లూరి సీతారామరాజు జ్యోతిని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ స్వీకరించారు.