హైదరాబాద్ :
ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ రెడ్డి సర్కార్కు చీమకుట్టినట్టు కూడా లేదని మల్కాజ్గిరి పార్లమెంటు సబ్యులు ఈటల రాజేందర్ విమ్మర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, మేధావులు, ఎస్సీ ఎస్టీ సంఘాల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఈటల.రేవంత్ రెడ్డిది బండరాయి లాంటి ప్రభుత్వం.మానవత్వం లేని ప్రభుత్వం.మనిషైతే ప్రాణం విలువ తెలుస్తుంది.భూములు అమ్మి డబ్బులు డిల్లీకి పంపిస్తున్నాడు.కేసీఆర్ లెక్కనే ఈ సీఎం చుట్టూ కూడా ల్యాండ్ మాఫియా తయారయ్యింది. పేరుకే ప్రజాస్వామ్యం తప్ప పవర్ అంతా సెంట్రలైజ్ అయిపోయింది. హైడ్రా భూమాఫియాకు కొమ్ము కాస్తుంది.చట్టం చట్టబండలై బాసుల ఆదేశాల మేరకే పనులు జరుగుతున్నాయి. దేనికైనా హద్దు పద్దు ఉంటుందన్నారు.గతంలో మాలాంటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో మాట్లాడితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ధర్నా చేసేవారు కొంత సంతోషపడేవారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఈ సమస్య పరిష్కరించండి అని వినతి పత్రాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ధర్నాలలో అఖిలపక్ష నాయకులు మాట్లాడినా, సభలో ప్రతిపక్ష నాయకులు సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు అనడానికి సజీవ సాక్ష్యం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు. మీరు స్పందించకపోతే తెలంగాణ సమాజం తిరగబడుతుందని హెచ్చరిస్తున్నాను. ఫీజురెంబర్స్ మెంట్ బకాయిలు అనేవి కొద్ది మంది కాలేజీ యాజమాన్యాల సమస్య కాదు లక్షల మంది తల్లిదండ్రుల వేదన. ఫీజు కట్టలేదని కాలేజీలో అవమానం ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకున్న వారి దీన గాధ ఇది. మనిషి అనేటువంటి వాడికి తెలుస్తుంది ప్రాణం విలువ, బాధ అంటే ఏమిటి అని. ఈ ప్రభుత్వం మానవత్వం కోల్పోయి బండరాయి లెక్క మారింది. ఎన్నికల్లో హామీలు ఇస్తున్నప్పుడు నేను ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని ప్రశ్నించాను.. ఆరోజు ఆయనకే తెలివి ఉందా మాకు లేదా అని దబాయించారు.హైదరాబాదులో తునక భూమి అమ్మితే వేలకోట్ల రూపాయలు వస్తాయి వచ్చిన హామీలను అమలు చేస్తానన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. వచ్చి రెండు సంవత్సరాలు దాటింది.తునకలు అమ్ముకుంటున్నారు.. ప్రభుత్వంలో ఉన్నట్టుగానే ఈ ముఖ్యమంత్రి చుట్టూ కూడా ల్యాండ్ బ్రోకర్లు, ల్యాండ్ మాఫియా తయారయ్యారు.ఎల్లమ్మబండలో ఉన్న ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అని సుప్రీంకోర్టులో నెగ్గింది అంటేనే వారితో ఈ ప్రభుత్వం ఎంతగా కొల్యూడ్ అయిందో అర్థమవుతుంది. దాని విలువ 7వేల కోట్లు.ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేది 9 వేల కోట్లు.. ఎల్లమ్మ బండ భూమి అమ్మితే వచ్చేది 7వేల కోట్లు. నిజంగా ముఖ్యమంత్రి దమ్ముంటే ప్రజల పట్ల ప్రేమ ఉంటే నిజంగా సమస్యలు పరిష్కరించాలని ఉంటే ఎందుకు ఈ భూమిని బ్రోకర్లకు కట్టబెడుతున్నాడో సమాధానం చెప్పాలి. హైడ్రా వస్తే పేదల భూములు ఇల్లు పార్కులు కాపాడుతారు అనుకున్నాం ల్యాండ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అనుకున్నాం, కానే హైడ్రా ఈ ల్యాండ్ బ్రోకర్లకు అండగా నిలుస్తుంది. గాజులరామారంలో దగ్గర సర్వేనెంబర్ ఏడులో 300 ఎకరాల భూమిలో 40 గజాల్లో గుడిసెలు వేసుకుంటే వాటిని కూలగొట్టారు కానీ ల్యాండ్ మాఫియా చేతిలో ఉన్న భూమిని మాత్రం ముట్టలేదు.పేదల ఇల్లు కూలగొట్టి 15 వేల కోట్ల రూపాయల విలువగల భూమిని కాపాడామని ప్రకటన ఇచ్చుకోవడం నిస్సిగ్గుగా ఉంది. 5వేల కోట్ల పెట్టి గాంధీ విగ్రహాలు పెడతాను, లక్షన్నర కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తానని ముఖ్యమంత్రి చెప్తున్నారు..అభ్యంతరం లేదు కానీ మా పిల్లల ఆత్మహత్యలు ఆపి, మా పిల్లలకు దూరమవుతున్న విద్య అందించిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఫైనాన్స్ సెక్రెటరీలు మా చేతిలో కూడా ఏమీ లేదుని చేతులెత్తేస్తున్నారు. పేరుకే ప్రజాస్వామ్యం తప్ప పవర్ అంతా సెంట్రలైజ్ అయిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రి చెప్పితే తప్ప బిల్లులు రాని పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో అర్థం చేసుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులకు వారు దాచుకున్న బెనిఫిట్స్ అందడం లేదు. కాంట్రాక్టు పని చేసిన వారు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ బిల్లుల కోసం బ్రోకరిజం చేసే వాళ్ళు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. డబ్బులు సంపాదించాలి కేంద్ర పార్టీకి పంపించాలి అనే జెండా తప్ప మరోటి లేదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లుగా మీరు పనులు చేస్తున్నారు కానీ మీరు చేస్తున్నవన్నీ లెక్క రాసి పెడుతున్నాము. సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం సత్తా చూపిస్తుంది. దేనికైనా హద్దు పద్దు ఉంటుంది.. తెలంగాణ సమాజానికి మాయ చేయడం రాదు బరిగిసి కొట్లాడుతుంది. పాతబకాయిలు అని తప్పించుకుంటున్నారు పాత బకాయిలు ఉన్న ఇళ్ల బిల్లు, కరెంటు బిల్లు, నల్లాబిల్లును వసూలు చేయడం లేదా ? బకాయిలు ఎట్లా వసూలు చేసుకుంటున్నారో గతంలో ఉన్న బకాయిలను కూడా చెల్లించాలని జ్ఞానం మీ ప్రభుత్వానికి లేదా ? అధికారులారా మీరు బానిసలు లెక్క పనిచేయకండి. వాళ్లకంటే సోయి లేదు, ఐఏఎస్ అధికారులు మీరేనా చెప్పండి. మంచి పోస్టింగుల కోసం వాళ్ల దగ్గర బానిస లెక్క మారటం జుగుప్సాకరంగా ఉంది. తెలంగాణలో సామాన్య ప్రజలకు దిక్కు మొక్కు లేకుండా పోయింది. చట్టం చట్టబండలై బాసుల ఆదేశాల మేరకే పనులు జరుగుతున్నాయి. స్వామిబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మపద్ధంగా పాలన జరగడం లేదు. ఇది మంచిది కాదు. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసం కాదు. తెలంగాణ తెచ్చుకుంది ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని సమాజం కోసం. తెలంగాణ ప్రజలారా కొంతమంది సంఘాలు నాయకులు మాట్లాడినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. మీరు కన్నెర్ర చేస్తేనే పరిష్కారం అవుతుంది. కర్రు కాల్చి వాత పెట్టే స్థాయికి రాకపోతే వీరు మారరు. ప్రజల కన్నీళ్లు పెడుతున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా బయటకు వచ్చి ప్రజల అవసరాల కోసం కోట్లాడాలని పిలుపు నిచ్చారు.. మీరు చేస్తున్న ఈ ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందనీ ఈటల రాజేందర్ అన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.