ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 23న “ఛలో హైదరాబాద్”

Facebook
X
LinkedIn

కుషాయిగూడ :

తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియ) రాష్ట్ర సహాయకార్యదర్శి
ఎం.రేవతి కళ్యాణి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ కుషాయిగూడ పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందనీ ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతరం రేవతి కళ్యాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో నిర్వహించే “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని వారు పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ 23వ తారీకు జరుపుతున్నామని అనంతరం ప్రవీణ మాట్లాడుతూ
ఆశా కార్యకర్తలు ప్రజారోగ్య రంగంలో ముఖ్య భూమిక పోషిస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు, శిశువులు, బాలింతల సంరక్షణలో కీలకంగా సేవలందిస్తున్నారు. అయినప్పటికీ, వారికి తగిన పారితోషికం, భద్రత, గౌరవం లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.