హైదరాబాద్‌ను చుట్టుముట్టిన వాయుకాలుష్యం

Facebook
X
LinkedIn

  230 దాటి ప్రమాదకర స్థాయికి చేరిన  గాలి నాణ్యత ప్రమాణం

హైదరాబాద్ :

హైదరాబాద్‌ను చుట్టుముట్టిన వాయుకాలుష్యం చలితో వణికిపోతున్న హైదరాబాద్ మహానరగరాన్ని మరోవైపు వాయు కాలుష్యం చుట్టుముట్టింది. చలి, పొగ మంచు కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. శీతాకాలపు పొగమంచుకు తోడు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం వల్ల గాలిలో సూక్ష్మ ధూళికణాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఉదయం సమయంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు, పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ జోన్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల వెంట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత ప్రమాణం 230 దాటి ప్రమాదకర స్థాయికి చేరింది. గరిష్టంగా అమీన్‌పూర్ 289 పాయింట్లు, గచ్చిబౌలిలో 286, మాదాపూర్, విట్టల్‌రావు నగర్‌లో 230 పాయింట్లుగా నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 పాయింట్లు దాటింది.