బిసి రిజర్వేషన్స్ 42 శతం పెంచిన తర్వాతే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలి

Facebook
X
LinkedIn

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య  

హైదరాబాద్ :

రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఇటీవల  జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు 50 శాతానికి పైగా సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచి  తమ సత్తా  చాటారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.కామా రెడ్డి డిక్లరేషన్  ప్రకారం 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఇంకా 10 శాతం సీట్లు గెలుచుకునే వారని అన్నారు. శాతం రిజర్వేషన్ ప్రకటించకుండా హడావుడిగా సర్పంచ్ ఎన్నిక నిర్వహించి ఇందులో కేవలం పదిహేడు శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించారని దీంతో ప్రజలు తిరగబడి బీసీలకు అత్యధికంగా పట్టం కట్టాలి అన్నారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ జరిపిన బంద్ వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగిందని దాంతోటే ఎన్ని ఎన్నికల్లో సర్పంచులు గెలిచారన్నారు. అగ్రకులాల వారు వివిధ పార్టీల వారు బిసి సర్పంచ్ లను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల్లారా ఖబర్దార్ అని  ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బిసి సర్పంచ్ లకు బిసి సంక్షేమ సంఘం  అండగా ఉంటుందన్నారు.  40 సంవత్సరాల క్రితం ఒక్క బీసీ సర్పంచి లేరని ఈరోజు 50 శాతం మంది బీసీలు గెలిచారంటే అది బీసీల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనం అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని కృష్ణయ్య హెచ్చరించారు. జడ్పిటిసి, ఎంపిటిసి   42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే జరపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. కోర్టులో వీటికి సంబంధించి కోర్టులో కేసు బలంగా ఉందని  బీసీల వైపే న్యాయం గెలుస్తుంది అన్నారు. జీవో నెంబర్ 9 రాజ్యాంగబద్ధంగా ఉందన్నారు అసెంబ్లీ లో చట్టం చేశారని జనాభా లెక్కలు చేసి బీసీల జనాభాను 50% గా చేశారన్నారు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కోర్టులో వైఖరి కూడా మార్చుకుంటున్నాయని అన్నారు. కోర్టు తీర్పు వ్యర్తిరికంగా  వస్తే రాష్ట్రం అగ్గి కుండంగా మారుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. వచ్చే నెల జూన్ నుండి దేశ వ్యాప్తంగా  బీసీల జనగణన జరగబోతున్నట్లు కృష్ణయ్య పేర్కొన్నారు. దేశాన్ని బీసీలకు అప్పగించిన ఘనత మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానిదబ్బారు.