అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠా అరెస్ట్

Facebook
X
LinkedIn

ఇద్దరు నవజాత శిశువులను సురక్షితంగా రక్షించడంతో పాటు 11 మంది నిందితులను అరెస్ట్

హైదరాబాద్ :

మియాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఎస్ఓటీ (ఎస్ఓటి) బృందంతో కలిసి హైదరాబాద్ కేంద్రంగా పలేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠాను ఛేదించారు.ఈ ఘటనలో ఇద్దరు నవజాత శిశువులను సురక్షితంగా రక్షించడంతో పాటు 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు.విస్వసనీయ సమాచారం మేరకు శిశువుల అక్రమ విక్రయాల్లో పాల్గొంటున్న ముఠాపై వల పన్ని,మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన నిందితులను వారి అనుచరులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు.పేదరికంలో ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపి శిశువులను కొనుగోలు చేసి,పిల్లలు లేని సంపన్న కుటుంబాలకు భారీ మొత్తాలకు విక్రయించడమే ఈ ముఠా మోదస్ ఆపరెండీగా పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో ప్రధాన నిందితులుగా వ్యవహరిస్తున్న బాబు రెడ్డి,గంగాధర్ రెడ్డి ఇప్పటికే సైబరాబాద్,రాచకొండ,హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌తో పాటు తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ప్రాంతాల నుంచి అక్రమంగా శిశువులను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించిన సమయంలో నిందితులను పట్టుకున్నారు.రక్షించబడిన ఇద్దరు నవజాత శిశువులను అమీర్‌పేట్‌లోని శిశు విహార్‌కు అప్పగించారు.ఈ అరెస్టులు మాధాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ ఐపీఎస్ పర్యవేక్షణలో జరగగా,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ విజయవంతమైన ఆపరేషన్‌ను అభినందించారు.