సమాజంలో ఉన్న వ్యవస్థ లో మార్పు రావాలి

Facebook
X
LinkedIn

ప్రజాపాలనపరివార్తన అనే అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తలు

హైదరాబాద్ :

ప్రజాపాలన, పరివార్తన అనే అంశం పై ఆచార్య డి ఎమ్ రవిప్రసాద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం తన కార్యాలయం లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రొఫెసర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న విభేదాల కారణంగా మనం వెనుక పడి ఉన్నామని, కాగా ప్రజలు పాలకులను నిలదీసినపుడే వారిలో చలనం వస్తుందని అన్నారు. అనంతరం ఆచార్య రవిప్రసాద్ మాట్లాడుతూ ముందుగా సమాజంలో ఉన్న వ్యవస్థ లో మార్పు రావాలి, ప్రతి ఒక్కరు సమాజం కొరకు,, మన భవిష్యత్ కొరకు ఎం చేయాలి అనే ఆలోచన ఉన్నపుడే మార్పు వస్తుంది. అనంతరం ఆచార్య రవిప్రసాద్ రచించిన ప్రేమపురాణం అనే పుస్తకాని అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ సంఘ సేవకుడు, సామజిక వేత్త కాషామొల్ల కృష్ణ మాట్లాడుతూ సమాజం లో వస్తున్న కుల తత్వ, విభేదాల వళ్ల మార్పు రాదు, సృష్టి లో ప్రధాన మైన పాత్ర ప్రేమ అనే పదం దీన్ని మనం ఎంత పొగిడిన తక్కువే ఆచార్య రవిప్రసాద్ రచించిన ప్రేమపురాణం అనే పుస్తకం వల్ల జనాలో మార్పు తప్పక వస్తుందన్నారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు, విద్యావేత్తలు. ప్రముఖ సంఘ సేవకుడు, బిల్డర్. ఇ. వెంకటస్వామిగౌడ్, నాయవాది ప్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు.