ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

Facebook
X
LinkedIn

రాయ్‌పూర్ :

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు చనిపోయారు. మృతులు మహిళ ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా మందు గుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇరుపక్షాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.