కొత్త ఏడాదిలో మేష రాశి వారిపై శని ప్రభావం..! పరిహారాలు

Facebook
X
LinkedIn

Mesha Rasi Phalalu 2025: కొత్త ఏడాది ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం, మేష రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. అయితే ఈసారి వచ్చే కాలంలో మేష రాశి వారికి శని సాడేసతి ప్రారంభమవుతుంది. శని దేవుడు కుంభ రాశి నుంచి మీనంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా మేష రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ రాశి నుంచి గురుడు మూడో స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి అన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మేష రాశి వారికి వ్యాపారం, విద్యా, ఆర్థిక, ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రేమ జీవితంలో..

మేష రాశి వారికి 2025 నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు. మీ భాగస్వాములను, స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.