మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా వుంటుంది : కేశినేని వెంక‌ట్

Facebook
X
LinkedIn

ఎన్.ఐ.ఆర్.డి లో శిక్షణ పూర్తిచేసిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు సర్టిఫికేట్లు అంద‌జేత

ఎంపీ కేశినేని శివ‌నాథ్, కేశినేని ఫౌండేష‌న్ కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన కేశినేని వెంక‌ట్

మహిళలు స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు

విజ‌య‌వాడ :

మ‌హిళ‌లు స్వ‌యం స‌మృద్ది దిశ‌గా ముందుడుగే వేయాల‌ని, అందుకు కేశినేని ఫౌండేష‌న్ ఎల్ల‌ప్పుడు స‌హ‌కారం అందిస్తుంద‌ని కేశినేని ఫౌండేష‌న్ డైరెక్ట‌ర్ కేశినేని వెంక‌ట్ తెలిపారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ , కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఎన్.ఐ.ఆర్.డి స‌హ‌కారంతో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో డిసెంబ‌ర్ 8 నుంచి 12 వ‌ర‌కు ఐదు రోజుల పాటు జ‌రిగిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారంతో ముగిసింది. శిక్ష‌ణ పొందిన వారిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 61 మంది ఎస్.హెచ్.జి మ‌హిళలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో కేశినేని ఫౌండేష‌న్ డైరెక్ట‌ర్ కేశినేని వెంక‌ట్ వారిని క‌లిసి స‌ర్టిఫికెట్స్ అంద‌జేశారు. ఈమేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్, కేశినేని ఫౌండేష‌న్ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడ‌క్ట్స్, హోమ్ బెస్డ్ ప్రొడ‌క్ట్స్ లో ఐదు రోజుల పాటు శిక్ష‌ణ పొందిన‌ మ‌హిళ‌లకు స‌ర్టిఫికేట్స్ అందించారు. ఆ మ‌హిళ‌లంద‌రితో మాట్లాడి శిక్ష‌ణ‌లో భాగంగా ఏమి నేర్చుకున్నారో అడిగి తెలుసుకున్నారు. త‌మ జీవ‌నోపాధి పెంచేందుకు ఇలాంటి అవ‌కాశం ఇంత‌వ‌ర‌కు ఎవ‌రు క‌ల్పించ‌లేదంటూ కృత‌జ్ఞ‌తలు తెలిపారు. త‌మ‌కి రూపాయి ఖ‌ర్చు లేకుండా శిక్ష‌ణ ఇప్పించిన కేశినేని ఫౌండేష‌న్ , ఎంపీ కేశినేని శివ‌నాథ్ ల‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా కేశినేని వెంక‌ట్ మాట్లాడుతూ హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడ‌క్ట్స్, హోమ్ బెస్డ్ ప్రొడ‌క్ట్స్ లో శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు గ్రామాల్లో ఇంకొంత మంది మ‌హిళ‌ల‌కు కూడా శిక్ష‌ణ ఇచ్చి…ఒక యూనిట్ మొద‌లు పెట్టాల‌న్నారు. ఆ యూనిట్ లో త‌యారు చేసే వ‌స్తువుల‌కు అవ‌స‌ర‌మైన మార్కెటింగ్ స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. శిక్ష‌ణ పొందిన‌ మ‌హిళ‌ల‌కు స్వయం సమృద్ధి, ఆర్థిక స్వాతంత్య్రం పొందే దిశగా అడుగువేయాల‌ని సూచించారు. గ్రామీణ ప్రాంత మ‌హిళ‌లు ఆర్థికంగా అభివృద్ది చెందితే వారి కుటుంబాలే కాదు… సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికో పారిశ్రామిక వేత్త వుండాల‌న్న ఆశ‌యంతో కృషి చేస్తున్నార‌ని తెలిపారు. వారి స్పూర్తితోనే ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో ఈ శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రిగింద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎన్.ఐ.ఆర్.డి సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ మ‌హ్మాద్ ఖాన్, ప్రొఫ‌స‌ర్ డాక్ట‌ర్ క‌తిరేష‌న్,ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, గాంధీ హ్యాండ్ మేడ్ పేప‌ర్ యూనిట్ అధికారి జె.ర‌వీంద్ర‌, ఉత్త‌మ్ ఇండ‌స్ట్రీస్ అధికారి మాన‌స‌ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.