14న టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలి

Facebook
X
LinkedIn

కాప్రా :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) జిల్లా 3వ మహాసభలను ఈనెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు మల్కాజ్గిరి నేరేడ్మెట్ లోని ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుందని టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ జి హరిప్రసాద్, కో కన్వీనర్ పి మల్లేష్ ప్రకటనలో తెలిపారు.
ఈ మహాసభలో జర్నలిస్టుల ఇంటి స్థలాలు, హెల్త్ స్కీమ్, ప్రమాద బీమా, అక్రిడేషన్ కార్డులు తదితర అం శాలపై చర్చిం చనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొని, నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.
ఈ మేడ్చల్ జిల్లా మహాసభకు టీడబ్ల్యూజెఎఫ్ అడహక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పిల్లి రాంచందర్, టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జ్ ఎస్ కె సలీమా, ప్రజా ప్రతినిధులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.
జిల్లాలోని జర్నలిస్టులందరూ హాజరై ఈ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.