చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా తొలి విడుత పోలింగ్‌

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుత ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తయ్యింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానున్నది. రాత్రి వరకు పోలింగ్‌ ఫలితాలు ప్రకటించి.. ఉప సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహించనున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులు పోలింగ్‌ను పర్యవేక్షించారు.తొలి విడుతలో 4,236 సర్పంచ్‌ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఇందులో 396 సర్పంచ్‌ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,834 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు విడుతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎస్‌ఈసీ కమిషనర్‌ పేర్కొన్నారు. మూడు విడుతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. 3,591 మంది రిటర్నింగ్‌ అధికారులను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా 3,461 పోలింగ్‌ కేంద్రాలను.. 45,086 బ్యాలెట్‌ బాక్సులను వినియోగిస్తున్నట్లు చెప్పారు.