కరూర్‌ తొక్కిసలాట.. డిసెంబర్ 1 నుంచి సుప్రీంకోర్టు ప్యానెల్‌ ఇన్‌స్పెక్షన్‌

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

కరూర్‌ తొక్కిసలాట  ఘటనపై సుప్రీంకోర్టు ప్యానెల్‌  ఇన్‌స్పెక్షన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు ఈ ఇన్‌స్పెక్షన్‌ కొనసాగనుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ రస్తోగి   నేతృత్వంలో ఏర్పాటైన ఈ త్రిసభ్య ప్యానెల్‌.. సీబీఐ దర్యాప్తు   ను సమగ్రంగా పర్యవేక్షించనుంది.ఘటనపై కరూర్ జిల్లా అధికారులను అణువణువూ ఆరా తీయనుంది. తొక్కిసలాట సమయంలో ఏ నిమిషంలో ఏం జరిగిందనే వివరాలను రాబట్టి మ్యాపింగ్ చేయనుంది. స్థానిక అధికార యంత్రాంగం నుంచి వివరాలను రాబట్టడం కోసం సుప్రీంకోర్టు ప్యానెల్‌ ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసి పెట్టుకుంది.కాగా, గత నెల 12న ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్‌ విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీకి జనం అంచనాలకు మించి హాజరుకావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు.