విద్యార్థినితో గుంజీలు తీయించడంతో బాలిక మృతి

Facebook
X
LinkedIn

ముంబయి :

స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో విద్యార్థినితో గుంజీలు తీయించడంతో బాలిక మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆరో తరగతి చదువుతోంది. సదరు విద్యార్థిని స్కూల్‌కు ఆలస్యంగా రావడంతో బాలికపై స్కూల్ టీచర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వంద గుంజీలు తీయాలని విద్యార్థినికి తెలిపింది. గుంజీలు తీస్తుండగా బాలిక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తన కూతురు వీపు బ్యాగు పెట్టి గుంజీలు తీయించడంతో కిందపడి చనిపోయిందని బాలిక తల్లి ఆరోపణలు చేసింది. విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై మండిపడడంతో పాటు నిరసనలు తెలిపాయి. దీంతో టీచర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేయడంతో ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.