విద్యార్థులు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌పై దృష్టి సారించాలి

Facebook
X
LinkedIn

                  ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

అమరావతి :

విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో కూడా మార్పు రావాలని ఏపీ గవర్న్‌ అబ్దుల్‌ నజీర్‌   సూచించారు. ముఖ్యంగా సాంకేతికంగా, విజ్ఞానపరంగా జరుగుతున్న అభివృద్ధివైపు, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌   పై దృష్టి సారించాలని పేర్కొన్నారు.కర్నూల్‌ జిల్లా రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. స్నాతకోత్సవంలో అధికంగా బాలికలే బంగారు పతకాలు సాధించడం అభినందనీయమని, బాలురు కూడాఅత్యధిక సంఖ్యలో బంగారు పతకాలు సాధించి కలలను సాకారం చేసుకోవాలని సూచించారు.విద్యతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని,వ్యక్తిగత అభివృద్ధికి ఎంతగానో దోహదమవుతుందని పేర్కొన్నారు. ప్రపంచం సాంకేతికవైపు దూసుకుపోతున్న తరుణంలో వచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.