స్కూల్స్‌, బస్టాండ్స్‌ నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించండి..

Facebook
X
LinkedIn

                        సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూ డిల్లీ :

వీధి కుక్కల   సమస్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు   కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్సు,   రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాలు సహా పబ్లిక్‌ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. వాటిని షెల్టర్లకు తరలించాలని సూచించింది.న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వాటిని పట్టుకున్న తర్వాత తిరిగి అదే ప్రదేశాల్లో వదలకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలను గుర్తించాలని ధర్మాసనం సూచించింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా నిరోధించేందుకు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతేకాదు, క్రమం తప్పకుండా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది.