శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులు క్షేమం  

Facebook
X
LinkedIn

 అచ్చంపేట  :

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అక్కమ దేవి ఘాట్ రోడ్డులోని కఠిన మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా తిరిగిపోయింది.వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌ నుండి శ్రీశైలం దిశగా బయలుదేరిన బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో అక్కమ దేవి మలుపు వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. బస్సు రోడ్డుపై అడ్డంగా తిరిగిపోవడంతో ఘాట్‌ రహదారిపై రెండు గంటలకు పైగా భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనా చివరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.