విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌.. సస్పెండ్‌

Facebook
X
LinkedIn

శ్రీకాకుళం :

పిల్లలకు చదువులు చెప్పి బుద్ధిమంతులుగా మార్చాల్సిన ఓ టీచర్‌ దుర్మార్గంగా వ్యవహరించింది. టీచర్‌ హాయిగా కుర్చీలో కూర్చొని ఫోన్‌ మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్‌ కావడంతో ఉపాధ్యాయురాలిపై విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజికవర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎంతో గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి.. విద్యార్థులను ఇలా బానిసలుగా చూస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు టీచర్‌ సుజాతను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.