హత్య చేసిన ఐదుగురికి ఉరిశిక్ష

Facebook
X
LinkedIn

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు

హత్య జరిగిన పదేళ్ల తర్వాత నిందితులు చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ, ఎం.వెంకటాచలపతి, మంజునాథ్‌, జయప్రకాశ్‌, వెంకటేశ్‌లకు ఉరిశిక్ష

చిత్తూరు :

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. మేయర్‌ కటారి హేమలత దంపతులను హత్య చేసిన ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. హత్య జరిగిన దాదాపు పదేళ్ల తర్వాత నిందితులు చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ, ఎం.వెంకటాచలపతి, మంజునాథ్‌, జయప్రకాశ్‌, వెంకటేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేసింది.చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ, మోహన్‌ దంపతులను నగర పాలక సంస్థ కార్యాలయంలోనే 2015 నవంబర్‌ 17వ తేదీన దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా చేర్చారు. కాసరం రమేశ్‌ (ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్‌ దాఖలు చేయగా, అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌.శ్రీనివాసాచారి (ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దీంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో 16 మందిపై ఉన్న కేసును కొట్టివేశారు. ఇందులో మేయర్‌ భర్త మోహన్‌ మేనల్లుడు శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ (ఏ1), గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్‌ వెంకటేశ్‌ (ఏ2), జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జయారెడ్డి (ఏ3), మంజునాథ్ అలియాస్‌ మంజు (ఏ4), మునిరత్నం వెంకటేశ్‌ (ఏ5)పై నేరం రుజువైంది.ఈ హత్య కేసుపై విచారణ చేపట్టిన ఏడీజీ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. దోషుల్లో ఏ1గా ఉన్న చింటూ రూ.70లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. మేయర్‌ దంపతుల వారసులకు రూ.50 లక్షలు, గాయపడిన వేలూరి సతీశ్‌ కుమార్‌ నాయుడికి రూ.20 లక్షలు చెల్లించాలని సూచించింది.