ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

Facebook
X
LinkedIn

 న్యూఢిల్లీ :

రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే అని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసులో క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం కూడా ఇవ్వాల్సిందే అని పేర్కొంది. యూజర్, పాస్‌వర్డ్‌ల సమాచారం ఇవ్వాల్సిందే నని జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్‌కు సూచించింది. సమాచారం చెరిపేందుకు యత్నించినట్లు తేలితే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.