శీతాకాలంలో వచ్చే దగ్గు, జ్వరం, మలేరియా, ప్లేట్‌లెట్స్ లోపం వంటి సమస్యలకు రేగిపండు వరం.. రోగనిరోధకశక్తిని పెంచి, గింజలు, ఆకులు జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీని ఆకులు, వేర్ల కషాయం కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Jujube Fruit: శీతాకాలంలో చాలా పండ్లు వస్తాయి. కానీ సహజంగా పండించిన రేగిపండు రుచికరంగా ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది కేవలం శీతాకాలంలో మాత్రమే కనిపిస్తుంది. చలికాలం ప్రారంభం కాగానే గిరిజన ప్రాంతాల్లో ఈ చెట్లు బాగా పెరుగుతాయి. కొండ ప్రాంతాలలో ఈ పండ్లు పొదలుగా పెరుగుతాయి. కిలో 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
గాయాలను వేగంగా నయం చేయడంలో..
ఆయుర్వేదం ప్రకారం దగ్గు, జ్వరం, మలేరియా, ప్లేట్‌లెట్స్ లోపం వంటి సమస్యలకు రేగిపండు వరం. ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇది గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని గింజలు, ఆకులు జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీని ఆకులు, వేర్ల కషాయం కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు.