ఏఐతో ఉద్యోగాలకు ముప్పు!బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

Facebook
X
LinkedIn

న్యూఢిల్లీ :
కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో, కొన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఈ సాంకేతికత సాధారణ పనులను సమర్థవంతంగా నిర్వహించగలదని తెలిపారు.

టెలిసేల్స్, టెలి సపోర్ట్, సాధారణ కోడింగ్ పనులను ఏఐ భద్రముగా చేపట్టగలదని విశ్లేషణ
సంక్లిష్ట కోడింగ్ టాస్క్‌లకు మాత్రం ఇప్పటికీ ఏఐకు సవాళ్లే
పారాలీగల్స్, ఎంట్రీ లెవల్ అకౌంటెంట్ల ఉద్యోగాలకు ముప్పు
అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐ వరంలా మారే అవకాశం
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఏఐ ఉపయోగాన్ని గేట్స్ హైలైట్

‘‘ఏఐ పురోగతికి నేను ఆశ్చర్యపోయాను. సరైన విధంగా వినియోగిస్తే మానవాళికి మేలు చేస్తుంది’’ అని గేట్స్ పేర్కొన్నారు. అయితే, గతంలో రొబోటిక్ టెక్నాలజీ బ్లూ కాలర్ ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేసిందో, ఇప్పుడు ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలపై కూడా అలాంటి ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.