మునుగోడు ఎమ్ఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ :
పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదని మునుగోడు ఎమ్ఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అని తెలిపారు. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి వచ్చానని అన్నారు. జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారని మండిపడ్డారు. భువనగిరి ఎంపిని గెలిపిస్తే మంత్రి పదవిని ఇస్తారన్నారని, తనకు మంత్రి పదవిని ఇస్తారా..ఇవ్వరా అనేది తమ ఇష్టం అని అన్నారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని, మనసు చంపుకని బతకడం తన వల్ల కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.