వసతి గృహాలలో  ప్రభుత్వం ప్రవేశపెట్టిన కామన్ మెనూ అమలుకావడం లేదు

Facebook
X
LinkedIn

               తెలంగాణ రాష్ట్ర ఈబిసి సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి

హైదరాబాద్ :

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కామన్ మెనూ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ నల్లగొండ నిజాంబాద్ మెదక్ వంటి జిల్లాల లలో  ఏమాత్రం అమలు కావడం లేదని  తెలంగాణ రాష్ట్ర ఈబిసి సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ee మేరకు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రబాకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ సంగం సభ్యుల బృందం స్వయంగా వసతి గృహాలను సందర్శించి విద్యార్థులతో మమేకమై మెనూ అమలు తీరును తెలుసుకున్నట్లు తెలిపారు. పిల్లలకు రోజువారి మెనూ అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రికి చెప్పడం జరిగిందని తెలిపారు. జిల్లా సంబంధిత సంక్షేమ అధికారులకు దృష్టికి తీసుకు వెళ్లిన కనీసం స్పందించడం లేదని మంత్రికి వినతిపత్రం ద్వారా తెలియపరచడం జరిగిందన్నారు.మెనూ అమలు తీరు పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన మాజీ డిజిపి పర్యవేక్షణ లో  ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది  బీసీ సంక్షేమ జిల్లా అధికారులు  కొంతమంది మెనూ అమలయితలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లితే ఆ సంబంధిత అధికారులను చరవాణి ద్వారా సంప్రదించిన ఆ కలెక్టర్లని తప్పుడు పట్టించిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు.అంటే పరిస్థితి ఎంతవరకు ఉందో గమనించాలని మంత్రి గారికి చెప్పడం జరిగింది సమస్య ను పరిష్కరిస్తామని  మంత్రి హామీ ఇవ్వడం జరిగిందని ప్రబాకర్ రెడ్డి తెలిపారు.మంత్రి ని  కలిసిన వారిలో రాజు, రమేష్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.