న్యూఢిల్లీ :
నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదు అని రాహుల్ గాంధి సోదరి ప్రియాంకా గాంధీ స్పందించారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సోమవారం సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. నిజమైన భారతీయులు అలా మాట్లాడరు అని కోర్టు ఆ కేసులో పేర్కొన్నది. కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ రాహుల్‌ను సమర్ధించారు. ప్రశ్నలు వేయడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్ష నేత విధి అని ఆమె అన్నారు. నిజమైన భారతీయులు కాదా అన్న స్టేట్మెంట్‌పై మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ పట్ల పూర్తి గౌరవం ఉందని, రాహుల్ గాంధీ సైన్యాన్ని, సైనికులను ఎల్లప్పుడూ గౌరవించారని ఆమె పేర్కొన్నారు.