శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేత..

Facebook
X
LinkedIn

పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు

ఆనకట్టపై నారాచంద్రబాబు నాయుడు కృష్ణమ్మ ప్రత్యేక పూజలు

శ్రీశైలం ;

శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరసారెలను సమర్పించారు. ఆ తర్వాత ఆనకట్టపై 6, 7, 8, 11 గేట్ల ద్వారా లాంచనప్రాయంగా నీటిని విడుదల చేశారు. అంతకు ముందు సీఎం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు.కృష్ణానదీ పరివాహక ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయానికి వరద పోటెత్తుతున్నది. సుంకేశుల, జురాల నుంచి 1.70లక్షల క్యూసెక్కులకరుపైగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882 అడుగుల మేర నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది.