అమెరికాలో విమాన ప్రమాదం

Facebook
X
LinkedIn

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విమానం
ఆరుగురు దుర్మరణం

ఓహాయో :

అమెరికాలో మరో విషాదకర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఒహాయో రాష్ట్రంలోని యంగ్స్‌టౌన్-వారెన్ ప్రాంతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన చిన్న విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

సెస్నా 441 మోడల్‌కు చెందిన ఈ విమానం ఆదివారం ఉదయం టేకాఫ్ అయ్యిందని, కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధం కోల్పోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. వెంటనే స్పందించిన సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశాయి.

వెస్టర్న్ రిజర్వ్ పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంతోనీ ట్రెవెనా మాట్లాడుతూ… ప్రమాదం తీవ్రతకు భయపడిపోయామని, ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని స్పష్టంచేశారు. మృతుల వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదని, గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం అత్యంత కష్టతరమైనదిగా ఉందని, సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయని హౌలాండ్ టౌన్‌షిప్ అగ్నిమాపక విభాగాధికారి రేమండ్ పేస్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై FAA అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.