అమరావతి :
ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకుందని అన్నారు. ఏడాది పాలన విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని చంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలోనే పేదల సేవలో, పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, మెగా డిఎస్పితో టీచర్ ఉద్యోగాలు, పెట్టుబడులతో ఉపాధి కల్పనకు అడుగులు వేశామని చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేశామని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.