విజయవంతంగా 6వ రోజు ముగిసిన టీడీపీ శిక్షణ తరగతులు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, అమరావతి :

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, యువనాయకులు నారా లోకేష్ ఆదేశానుసారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో 6వ రోజు ఘనంగా ముగిసాయి. నేడు కనిగిరి నియోజకవర్గ నాయకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ దమ్మలపాటి కౌశిక్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ…

ప్రజా సంక్షేమం, అన్ని వర్గాల అభివృద్ధికి తెలుగు దేశం పార్టీ కట్టుబడి పనిచేస్తుందన్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగిస్తూ లీడర్స్ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్రధాన్యతను కార్యక్రమంలో పాల్గొన్న నేతలకు తెలియజేశారు. నియోజకవర్గాల వారిగా నాయకుల అభిప్రాయాలు, సూచనలను తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు చేపట్టి సమర్థవంతమైన నాయకత్వంతో పాటు.. ప్రజా సంక్షేమానికి పాటుబడే నేతలను తయారు చేసేందుకు ఒక ఫైలెట్ ప్రాజెట్ గా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. సమసమాజ స్థాపనే టీడీపీ లక్ష్యమన్నారు. పేద బడుగుల అభివృద్ధే ధ్యేయమన్నారు. సమాజంలో అసమానతలు రూపొందించి ప్రగతిశీల సమాజానికి పత్రి నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.