ఛాంపియన్ లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా… క్రీడా శిక్షణ శిబిరాలు

Facebook
X
LinkedIn

తెలుగునాడు హైదరాబాద్ :

సమ్మర్ కోచింగ్ క్యాంపు కేవలం టైంపాస్ కి మాత్రమే కాకుండా
ఈ క్యాంపు లలో మంచి ప్రతిభ కన పరిచిన విద్యార్థినీ విద్యార్థుల
సమాచారాన్ని సంక్షిప్తం చేసి ఆన్లైన్లో వారు నమోదు చేసుకున్న వివరాల ద్వారా ఆయా క్రీడా పోటీల సందర్భంగా ఆసక్తి ఉన్నవారిని ఆయా క్రీడా పోటీలలో పాల్గొనే విధంగా స్పోర్ట్స్ స్కూల్ అకాడమీల సెలక్షన్ల సందర్భంగావారికి సమాచారం ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ అధికారులు భావిస్తున్నారు.
అంతేకాకుండా వారికి క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా ఏడాది పొడుగునా ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే వారిని అందులో భాగస్వామ్యం చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.

కేవలం సరదా కోసం సమ్మర్ క్యాంపులు లో పాల్గొనడమే కాకుండా అభవిషత్తు ఛాంపియన్లను తీర్చిదిద్దే విధంగా
ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోంది

సందడిగా స్టేడియాలు
ఈ సంవత్సరం జంట నగరాల స్టేడియంలో ప్రయోగాత్మకంగా ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థుల తల్లిదండ్రులకు యోగా మరియు జుంబా డాన్స్ ఉచితంగాకార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడం తో పిల్లలతో పాటు తల్లిదండ్రులు పాల్గొనడంతో స్టేడియాల్లో సందడి కనిపిస్తుంది .

శిబిరాల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని రకాల మెడికల్ సదుపాయాలు మరియు మంచినీటి వసతి కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడంతో
ఈ సంవత్సరం ఈ క్యాంప్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.