ముమ్మరంగా సాగుతున్న శిబిరాలు – క్రీడాకారుల నుండి అనూహ్యస్పందన
తల్లిదండ్రులకు ఉచిత యోగ/ జుంబా డాన్స్ ఏర్పాటు చేయడంతో ప్లేయర్స్ తో పాటు పేరెంట్స్ ఉత్సాహం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్పోర్ట్స్ స్టేడియాలతో పాటు 32 జిల్లా కేంద్రాల్లో ఈ ఉదయం నుండి ఈ శిబిరాలకు అనూహ్య స్పందన కనిపిస్తోంది
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్న ఈ శిబిరాలలో పాల్గొంటున్న యువ క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అందజేసింది.
క్రీడా సామాగ్రిని అందించడంతోపాటు ఆయా క్రీడాంశాల్లో అసిస్టెంట్ కోచులుగా వ్యవహరించే అర్హులైన సీనియర్ ప్లేయర్లకు గౌరవ వేతనం కూడా పెంచింది. దీనితో ప్రతి 20 మంది క్రీడాకారులకు ఒక కోచ్ చొప్పున వివిధ క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. ఈ శిబిరాలలో పాల్గొనే క్రీడాకారులు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
గతంలో 2500 మంది క్రీడాకారులు నగరంలో వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొనగా, ఇప్పటికే దాదాపు ఐదు వేల మంది
ఈ శిబిరాల్లో పాల్గొనడానికి మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా ప్రతిరోజు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.

గతం కంటే రెట్టింపు
వేసవి శిక్షణ శిబిరాలు ఏదో మొక్కుబడిగా నామమాత్రంగా నిర్వహించకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకురావడం పిల్లలతో పాటు పేరెంట్స్ ను కూడా క్యాంపులలో భాగస్వామ్యం చేయడం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ మధ్య విరివిగా ప్రచారం చేయడం మొదలైన అంశాలను కలిపి ఈసారి గతం కంటే రెట్టింపైన స్పందన, ఉత్సాహం లభిస్తోంది.